Saturday, August 30, 2014

Ganapathi Slokam

Slokam

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌. తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక చవితి పద్యములు

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌. 

తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము:

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు -
జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం