Saturday, August 30, 2014

45 ways to avoid using the word 'very'

45 ways to avoid using the word 'very'

Substitute ‘damn’ every time you’re inclined to write ‘very;’ your editor will delete it and the writing will be just as it should be. ~Mark Twain
'Very' is the most useless word in the English language and can always come out. More than useless, it is treacherous because it invariably weakens what it is intended to strengthen. ~Florence King
So avoid using the word ‘very’ because it’s lazy. A man is not very tired, he is exhausted. Don’t use very sad, use morose. Language was invented for one reason, boys - to woo women - and, in that endeavor, laziness will not do. It also won’t do in your essays. ~N.H. Kleinbaum

Ganapathi Slokam

Slokam

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌. తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక చవితి పద్యములు

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌. 

తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము:

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు -
జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం

Rishi Panchami by Chaganti Koteswara Rao garu

రుషి పంచమి (ఆగష్టు 30, 2014, శనివారం)

వ్రతాలన్నింటిలోనూ అత్యుత్తమైనది ఏదో చెప్పమని ధర్మరాజు కోరినప్పుడు, అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు చెప్పినదే 'రుషి పంచమి' వ్రతం. స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని 'భాద్రపద మాసం'లో 'శుక్ల పక్ష పంచమి' రోజున ఆచరించాలి. ఈ రోజున నదీ తీరానికి వెళ్లి దంతావధానం ... పరిమళ ద్రవ్యాలతో మంత్ర పూర్వకంగా స్నానం చేయాలి. ఆ తరువాత ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకుని, అక్కడ హోమం చేయాలి.
ఇంటికి చేరుకున్న తరువాత వ్రతానికి సంబంధించిన వేదికను పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మట్టితో గాని రాగితో గాని కలశం పెట్టుకుని అందులో నీటిని పంచ రత్నాలను ఉంచాలి. అష్టదళ పద్మం వేశాక సంకల్పం చెప్పుకోవాలి.
గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలను మహర్షుల నామాలను స్మరించుకోవాలి. సప్తరుషులను అరుంధతిని పూజించాలి. ఆ తరువాత కథ చెప్పుకుని వాయనదానాలు ఇవ్వాలి. ఇలా 7 సంవత్సరాల పాటు క్రమం తప్పక ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి.
ఇక ఈ వ్రతం జరుపుకోవడానికి కారణంగా చెప్పబడుతోన్న కథ గురించి తెలుసుకుందాం. పూర్వం విదర్భ దేశంలో సుమిత్రుడు - జయశ్రీ అనే దంపతులు నివసించేవారు. వేదశాస్త్ర పండితుడైన సుమిత్రుడు భార్యా విధేయుడు ... అందువలన ఆమె రుతు దోషాలను పట్టించుకోకుండా నడచుకుంటున్నా చూస్తూ ఊరుకునే వాడు. 'సుమతి' అనే కుమారుడు జన్మించిన కొంత కాలానికి వాళ్లు కాలం చేశారు.
సుమతికి చంద్రావతితో వివాహం జరిగింది ... నియమ నిష్టలను పాటిస్తూ వాళ్లు అన్యోన్యంగా కాలం గడపసాగారు. అలాంటి పరిస్థితుల్లో రుతుదోషానికి పాల్పడిన కారణంగా కుక్కగా జయశ్రీ, ఆ విషయంలో అడ్డు చెప్పనందుకు ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగా జన్మించారు. కొడుకు పట్ల తీరని ప్రేమానురాగాల కారణంగా వాళ్లు సుమతి ఇంటికి చేరుకున్నారు.
ఒక రోజున సుమతి తన ఇంట్లో పితృ కార్యాన్ని నిర్వహిస్తూ వుండగా, ఒక పాము వచ్చి పాయసం తాగేసి అదే పాత్రలో విషంకక్కి వెళ్లిపోయింది. కుక్క రూపంలో ఉన్న జయశ్రీ ఈ దృశ్యం చూసి, మిగిలిన పాయసాన్ని బ్రాహ్మణులకు వడ్డిస్తే ప్రమాదమని భావించి, చంద్రావతి చూస్తుండగా వాటిని తాకింది.
ఆవేశంతో ఆమె కర్రతో ఆ కుక్కను కొట్టి మళ్లీ పాయసాన్ని సిద్ధం చేసింది. ఇక సుమతి ఒకవైపున పితృ కార్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూనే, మరో వైపున బాగా పొద్దుపోయేదాకా ఎద్దుతో పొలం పనులు చేయించాడు.
ఆ రాత్రి ఎద్దు ... కుక్క రెండూ కూడా తమకి ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాయి. నియమ నిష్టల కారణంగా తనకి సంక్రమించిన కొద్దిపాటి శక్తితో, ఆ ఎద్దు ... కుక్కల ఆవేదనను సుమతి అర్ధం చేసుకున్నాడు.
తపోబల సంపన్నులను కలుసుకుని విషయాన్ని వివరించాడు. పూర్వ జన్మ పాప ఫలితంగానే తల్లిదండ్రులు అలా జన్మించి అవస్తలు పడుతున్నారనీ, పాప విముక్తి కోసం 'రుషి పంచమి' వ్రతం చేయాలని తెలుసుకున్నాడు.
సుమతి ఈ వ్రతం ఆచరించగానే కుక్క - ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లి దండ్రులు తమ దేహాలను వదలి పుణ్య లోకాలకు తరలి పోయారు. ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.


Collected from https://www.facebook.com/PravachanaChakravarti